వీసా నిబంధనలు సడలించిన భారత్
- October 22, 2020
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇవాళ వీసా నిబంధనలను సడలించింది. అన్ని వర్గాల విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే పర్యాటకం కోసం భారత్‌లో విజిట్ చేసేందుకు విదేశీయులకు అనుమతి ఇవ్వలేదు. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్నవారితో పాటు విదేశీయులకు ఈ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. పౌర విమానయానశాఖ ఆమోదించిన విమానాలకు మాత్రమే ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్, టూరిస్ట్, మెడికల్ వీసాలు తప్ప ఇతర అన్ని వీసాలను పునరుద్దరిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొన్నది. తాజా ఆదేశాలతో... బిజినెస్, కాన్ఫరెన్స్, ఉద్యోగం, విద్య, పరిశోధన, వైద్య సంబంధిత విషయాలకు హాజరయ్యేందుకు విదేశీయులకు అనుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!