వయోవృద్ధులకు ఇంటిదగ్గరే ఫ్లూ టీకాలు

- October 22, 2020 , by Maagulf
వయోవృద్ధులకు ఇంటిదగ్గరే ఫ్లూ టీకాలు

షార్జా: శీతాకాలంలో సహజంగా వ్యాపించే ఫ్లూను ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున చేపట్టిన వ్యాక్సిన్ డ్రైవ్ ఇంటింటికి చేరేలా షార్జా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వయోవృద్ధులకు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. షార్జా సంఘ సేవా బృందాలను ఇంటి దగ్గరికే పంపించి వృద్ధులకు ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఎవరైనా తమ ఇంట్లో వృద్ధులు ఉంటే..వాళ్లు వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 800700కు కాల్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ప్రస్తుతం కోవిడ్ 19 ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో సీజన్ ఫ్లూ వ్యాధులు వైరస్ ప్రబలేందుకు మరింత దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కింగ్డమ్ లోని పౌరులు అందరికీ ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చే భారీ కార్యక్రమాన్ని యూఏఈ చేపట్టింది. ప్రధానంగా రిస్క్ ఎక్కువగా ఉండే వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణిలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లందరికీ ఫ్లూ వ్యాక్సిన్ కొంత మేర సీజనల్ వైరస్ ను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. షార్జాలోనే కాకుండా ఇతర ఎమిరాతిల్లోనూ సీనియర్ సిటిజన్స్ కి ఇంటి దగ్గరికే వచ్చి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే..ప్రవాసీయులకు మాత్రం ఫ్లూ వ్యాక్సిన్ వేసేందుకు Dh 50 ఛార్జ్ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com