న్యూ ఇ-వీసా, పాస్‌పోర్ట్ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ
- October 23, 2020
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా, కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసుల్ని పౌరులు, వలసదారుల కోసం ప్రారంభించింది. వీసా మరియు పాస్‌పోర్ట్ జారీకి సంబంధించి వినూత్న ప్రక్రియల్ని ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ న్యూ సర్వీసుల్ని ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ప్రారంభించారు. అబ్షర్ ఇండివిడ్యువల్స్, అబ్షర్ బిజినెస్ మరియు ఎక్స్పాట్రియేట్ అనే పేర్లతో వీటిని ప్రారంభించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానంలో తమ రెసిడెన్సీ పర్మిట్లను వలసదారులు రెన్యువల్ చేసుకోవడానికి కొత్త సర్వీసు ఉపయోగపడుతుంది. 15 ఏళ్ళ లోపు చిన్నారులకు సౌదీ పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి వీలుగా కూడా కొత్త సర్వీసు ఉపకరిస్తుంది. వ్యక్తిగతంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్తో సంబంధం లేకుండానే కమ్యూనికేట్ చేసేలా ఈ విధానం తోడ్పడుతుంది. కాగా, సౌదీ అరేబియా జనాభా 34.8 మిలియన్లలో విదేశీయుల సంఖ్య 10.5 మిలియన్లుగా వుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు