మనీ లాండరింగ్‌: ఛారిటీ హెడ్‌కి జైలు

- October 23, 2020 , by Maagulf
మనీ లాండరింగ్‌: ఛారిటీ హెడ్‌కి జైలు

కువైట్: కువైట్‌ కోర్టు, ఓ ఛారిటబుల్‌ అసోసియేషన్‌ హెడ్‌కి జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. 211,000 కువైటీ దినార్స్‌ మోసానికి నిందితుడు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం నవంబర్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. అక్రమంగా ఆ సొమ్ముల్ని నిందితుడు తన బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడు. ఆ డబ్బుతో ఓ బిల్డింగ్‌నీ అలాగే ఓ కారునీ నిందితుడు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, కువైట్‌ ప్రభుత్వం ఇటీవల ఈ తరహా ఛారిటీ వ్యవహారాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com