దుబాయ్:పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫర్లు..
- October 24, 2020
దుబాయ్:పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణం చేసే వారిని ప్రొత్సహించేలా ఆఫర్లు ప్రకటించింది దుబాయ్ రోడ్డు రవాణా సంస్థ. ప్రజా రవాణా ద్వారా ప్రయాణం చేసే వారు 3 ఫోల్డ్ వినియోగం ద్వారా నNOL పాయింట్స్ ను పొందవచ్చని ఆర్టీఏ అధికారులు వివరించారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేంద్రాల ద్వారా సినిమా టికెట్లు, ఆన్ లైన్ షాపింగ్ డిస్కౌంట్ కూపన్లు పొందవచ్చని వివరించింది. 11వ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే సందర్భంగా ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకు ఈ అఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. నల్ పాయింట్లతో పాటు వినియోగదారులకు వోక్స్ సినిమా ద్వారా 100 సినిమా టికెట్లు అందించనున్నామని, అయితే..60 టికెట్లను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేంద్రాల్లో అందిస్తామని, మరో 40 టికెట్లను సోషల్ మీడియాలో క్విజ్ పోటీల ద్వారా వినియోగదారులు గెలుచుకోవచ్చని ఆర్టీఏ వివరించింది.
అలాగే నూన్.కమ్ ప్రతి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగదారుడికి ఆన్ లైన్ షాపింగ్ డిస్కౌంట్ కోసం ప్రొమో కోడ్ ను కూడా ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!