మణిరత్నం తీయనున్న మల్టీస్టారర్ చిత్రం

- May 26, 2015 , by Maagulf
మణిరత్నం తీయనున్న మల్టీస్టారర్ చిత్రం

ప్రస్తుతం కార్తీతో కలసి మల్టీస్టారర్ లో నటిస్తున్న నాగార్జున... నెక్స్ట్ మల్టీస్టారర్ మహేశ్ తో కలసి నటించబోతున్నాడట. నాగ్-మహేశ్ కలసి నటించనున్న ఈ మల్టీస్టారర్ లో... ఐశ్వర్యరాయ్ కూడా నటించబోతోందట. ఇదేదో ఆ మధ్య ఆగిపోయిందనుకున్న మణిరత్నం మల్టీస్టారర్ లా అనిపిస్తోంది కదూ. అవును.. అటకెక్కిందనుకున్న ఆ బిగ్ ప్రాజెక్ట్ మళ్లీ ఆరంభం కానుందట. ఇందుకు సంబంధించి.. ఈ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఒక్కొక్కటిగా పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం మహేశ్ 'శ్రీమంతుడు'లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రుతిహాసన్.. ఈ మల్టీస్టారర్ లోనూ మహేశ్ కు జంటగా మురిపించనుందని తెలుస్తోంది. ఇటీవల మణిరత్నం మల్టీస్టారర్ గురించి స్వయంగా స్పందించింది ఐశ్వర్యారాయ్. నిజానికి గత ఏడాదే ఈ సినిమా గురించి మణిరత్నం తనను సంప్రదించారని.. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో నటించలేకపోయానంది ఐశ్వర్య. ఇక రీసెంట్ గా మరోసారి ఈ విషయమై.. ఐశ్ ను సంప్రదించారట మణిరత్నం. ప్రస్తుతం జజ్బా అనే చిత్రంలో నటిస్తున్న ఐశ్... మణిరత్నం సినిమాపై సానుకూలంగా స్పందించిందట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ సినిమా తర్వాతే ఐశ్ కు హీరోయిన్ గా గుర్తింపు లభించింది. ఆపై గురు, రావణ్ వంటి చిత్రాల కోసం ఈ ఇద్దరూ కలసి పనిచేశారు. సో.. ఈ అనుబంధం కొద్దీ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తన కోసం బాలీవుడ్ లో సిద్ధంగా ఉన్నప్పటికీ... మణిరత్నం సినిమాకు అంగీకారం తెలిపిందట ఐశ్. మరి.. ఐశ్వర్య ఓకే చెప్పింది సరే.. నాగ్-మహేశ్ డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా..! అవునుమరి.. ప్రస్తుతం అదే పనిమీదనున్నారట మణిరత్నం. మరి.. ఈ ఇయర్ ఎండింగ్ కు అయినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందేమో చూడాలి..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com