విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
- October 25, 2020
విజయవాడ:ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేంద్రం పేదలకు అండగా నిలిచిందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట.. రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కల్గించాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు