ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి:మోదీ
- October 25, 2020
న్యూ ఢిల్లీ: భారత దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ... ప్రజలకు భద్రత కల్పిస్తున్న సైన్యానికి సలాం చేస్తూ... ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని.. మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ కోరారు. సైనికుల్ని స్మరించుకున్నాకే మనం పండుగలు చేసుకోవాలని సూచించారు. ఈ దేశం మొత్తం వారితో ఉందని దీపాల ద్వారా తెలపాలన్నారు. మన్ కీ బాత్‌లో దసరా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. కరోనా ఇంకా తగ్గలేదని... పండుగలు జరుపుకుంటూనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వోకల్ ఆఫర్ లోకల్ నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రజలంతా దేశీయంగా తయారయ్యే వస్తువులను పండుగ రోజుల్లో వాడాలని సూచించారు. దేశంలో ఐకమత్యం, ఏకత్వం కోసం జరిగే ప్రక్రియలో.. విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. కేంద్రం నడుపుతున్న http://ekbharat.gov.in ద్వారా విరాళాలు ఇవ్వాలన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







