బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్ర మోషన్ పోస్టర్ విడుదల
- October 25, 2020
హైదరాబాద్:మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వాహణలొ ప్రముఖ కామెడీ హీరో షకలక్ శంకర్ లీడ్ రోల్ లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది. నూతన దర్శకుడు కుమార్ కోట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది అనే క్యాచీ టైటిల్ తో అటు ఆడియెన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాల ఎటెన్షన్ తెచ్చుకున్న ఈ చిత్ర బృందం ఆ తరువాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో కూడా అనూహ్య స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ సభ్యులు తాజాగా ఓ మోషన్ పోస్టర్ సిద్ధం చేశారు. దసరా సందర్భంగా ఈ మోషన్ పోస్టర్ ను ప్రముఖ స్టార్ హీరోయిన్ డస్కీ బ్యూటీ ప్రియమణి విడుదల చేసి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల తెలిపారు. షకలక శంకర్ మార్క్ కామెడీతో పాటు యూత్ ని ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను అన్ని వర్గాలు ప్రేక్షకుల్ని అలరించే రీతిన రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు కుమార్ కోట తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు.
నటీనటులు
షకలక శంకర్
ప్రియ
అర్జున్ కళ్యాణ్
రాజ్ స్వరూప్
మధు
స్వాతి
అవంతిక
హీనా
రితిక చక్రవర్తి
సంజన చౌదరి
సాంకేతిక వర్గం
సమర్పణ : మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్
బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల
నిర్మాణ నిర్వాహణ : దత్తి సురేష్ బాబు
పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి
మ్యూజిక్ : పిఆర్
స్టోరీ, డైలాగ్స్ : విఎస్ రావ్
డైరెక్టర్ : కుమార్ కోట
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!