శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల:తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2 నెలలు విరామం తర్వాత సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెెలిపింది. వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఒక రోజు ముందు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి పర్మిషన్ ఇవ్వనున్నారు.

Back to Top