రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోందా..
- October 26, 2020
రష్యా:మహమ్మారి కరోనాను మర్చిపోయి మామూలు జీవితాన్ని గడుపుదామనుకుంటే కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినా రష్యా వాసుల్ని మాత్రం వైరస్ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,521 కేసులు నమోదైనట్లు అక్కడి రెస్పాన్స్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 15,13,877కు చేరుకుంది. రష్యాలో అత్యధిక కేసులు రాజధాని మాస్కో నుంచి నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మృతి చెందిన వారు 229 మంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారు 26,050కు చేరుకుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉండగా.. మొదటి మూడు స్థానాలు అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు