ఒమన్‌లో లులు కొత్త బ్రాంచ్
- October 26, 2020
మస్కట్: లులు హైపర్ మార్కెట్ ఒమన్‌లో కొత్తగా తన బ్రాంచ్ని ప్రారంభించింది. మర్కాజ్ అల్ బహ్జాలో అక్టోబర్ 26న ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా కొత్త బ్రాంచ్ని ప్రారంభించినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఈ బ్రాంచ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండర్ సెక్రెటరీ డాక్టర్ నాజర్ రషీద్ అబ్దుల్లా అల్ మావాలి ప్రారంభించారు. కాగా, ఒమన్‌లో ఇది 25 బ్రాంచ్ అనీ, ప్రపంచ వ్యాప్తంగా 194వ స్టోర్ అనీ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. కొత్త స్టోర్‌లో తాజా పండ్లు, ఆహార పదార్థాలు, కూరగాయలు, డెయిరీ ప్రోడక్ట్స్, పౌల్ట్రీ, మీట్ మరియు ఫిష్ వంటివి లభ్యమవుతాయి. డిపార్ట్మెంట్ స్టోర్ కోసం పెద్ద ప్రాంతాన్ని కేటాయించారు. గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్రోడక్ట్స్, స్టేషనరీ మరియు హోం అప్లయన్సెస్ ఇక్కడ లభిస్తాయి. లులు హైపర్ మార్కెట్స్ ఒమన్ అండ్ ఇండియా డైరెక్టర్ అనంత్ ఎవి మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో ఈ రంగం కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నా, తాము ధైర్యంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష