అబుధాబిలో ప్రవేశం కోసం ఎమిరేట్స్ ఐడీ కార్డుతోపాటు కోవిడ్ 19 సర్టిఫికెట్ తప్పనిసరి
- October 26, 2020
అబుధాబి:అబుధాబిలోకి ఇతర ఎమిరేట్స్ నుంచి వచ్చేవారు, తప్పనిసరిగా పోలీస్ మరియు ఇతర అథారిటీస్ సూచన మేరకు తగిన నిబంధనలు పాటించాల్సి వుంటుంది. చెక్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ట్రావెలర్స్ తమతోపాటు ఎమిరేట్స్ ఐడీ అలాగే కోవిడ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే సులభంగా అబుధాబిలో ప్రవేశించవచ్చునని అధికారుఉల సూచిస్తున్నారు. మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు. డ్రైవర్‌తో కలిపి ఓ వాహనంలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాల్సి వుంటుంది. చెక్ పాయింట్స్ వద్ద ఎంపిక చేసిన లేన్లలో మాత్రమే వాహనాలు నడపాలి. ఆయా వాహనాలకు సంబంధించి వేర్వేరు సైన్ బోర్డ్స్‌ని ఆయా లేన్స్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర వాహనాలకు రెడ్ కలర్, హెవీ వెహికిల్స్‌కి బ్లూ కలర్, ఎమిరేట్‌లో ప్రవేశం కోసం అనుమతి పొందిన వాహనాలకు గ్రీన్ లేన్లు కేటాయించారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







