డిగ్రీ అర్హతతలో 'ఎల్పీఓ' ఉద్యోగావకాశాలు..
- October 27, 2020
ఏపీలోని నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్. రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ..168 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (LPO) పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తుకు ఈనెల 28వ తేదీ ఆఖరు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 168 గుంటూరు: 20, విజయవాడ: 10, తెనాలి: 5, నరసరావుపేట: 8, సత్తెనపల్లి: 10, గుడివాడ: 10, మచిలీపట్నం: 10, రాజమండ్రి: 20, వైజాగ్: 15, తణుకు: 10, విజయనగరం: 10, హిందూపూర్: 15, కడప: 5, అనంతపురం: 10, ధర్మవరం: 10. విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్మార్ట్ఫోన్, వెహికల్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్థానికులకు మొదటి ప్రాధాన్యం.. జీతం మొదటి ఆరు నెలలు నెలకు రూ.10,000.. అనంతరం నెలకు రూ.12,500.. ఏడాది తర్వాత ప్రమోషన్ పొందితు పోస్టుకు తగ్గట్టు జీతం పెంచుతారు. దీంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. వయసు: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2020. వెబ్సైట్: https://www.apssdc.in/
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల