ప్రవాస భారతీయుల పాస్ పోర్టులో యూఏఈ చిరునామా చేర్చుకునేందుకు అవకాశం
- October 28, 2020
యూఏఈ:యూఏఈతో సహా ప్రపంచంలోని ఏ దేశంలోని చిరునామాతోనైనా ప్రవాస భారతీయులు పాస్ పోర్టు పొందే అవకాశం ఉందని దుబాయ్ లోని దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. యూఏఈలో కొన్నేళ్లుగా ఉంటున్న ఎన్ఆర్ఐలు తాము ఉంటున్న చిరునామాతోనే పాస్ పోర్టు పొందెందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇండియన్ పాస్ పోర్టు స్థానంలో కొత్త అడ్రస్ తో పాస్ పోర్టు పొందాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు అందరూ కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కోసం EWA/FEWA,SEWA బిల్లులను దరఖాస్తులో జతపరచాల్సి ఉంటుంది. అలాగే టెలిఫోన్ బిల్లులు, అద్దె ఒప్పందాల డాక్యుమెంట్, టైటిల్ డీడ్ లను కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఆమోదించనున్నట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..యూఏఈలోని అడ్రస్ తో పాస్ పోర్టులు పొందెందుకు ఏడాది కాలంగా తమ కార్యాలయానికి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని, ప్రతి రోజు పది నుంచి పన్నెండు వరకు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం