అప్పటివరకూ స్కూళ్లు తెరవొద్దు...
- October 28, 2020
న్యూ ఢిల్లీ:తెలుగు రాష్ట్రాలతోపాటూ... దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. అందువల్ల ఇప్పటికే చాలా వరకూ సడలింపులు ఇచ్చేసినా... స్కూల్స్ ఎప్పుడు తెరవాలనే అంశం అన్ని రాష్ట్రాలకూ ప్రశ్నగానే ఉంది. కొన్ని రాష్ట్రాలు... ఫలానా తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించాయి కూడా... ఐతే... అన్‌లాక్ 5 మార్గదర్శకాలు... మరో నెలపాటూ అంటే... నవంబర్‌లోనూ కొనసాగుతాయన్న కేంద్రం... స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ జారీ చేసింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. కేంద్ర అధికారులు మరో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అందువల్లే స్కూల్స్ తెరిచే విషయంలో కేంద్రం లోతుగా ఆలోచిస్తోంది.
నవంబర్ 30 వరకూ నో స్కూల్స్: కొత్త ఆదేశాన్ని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 10 (2)(1)లో అధికారాలను ఉపయోగించుకుంటూ... ఈ ఆదేశం జారీ చేసింది. దీని ప్రకారం... నవంబర్ 30 వరకూ స్కూళ్లు తెరవడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం