ఓవర్ క్రౌడెడ్ వర్కర్స్ అకామడేషన్స్పై ఉక్కుపాదం
- October 29, 2020
షార్జా:షార్జాలోని పలు వర్కర్స్ అకామడేషన్స్లో ఓవర్ క్రౌడెడ్ ఎక్కువగా వుంటున్నట్లు గుర్తించిన అధికారులు, ఆయా అకామడేషన్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. 500 మందికి సరిపోయే అకామడేషన్స్లో 800 మంది వరకూ వుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సీరియస్ ఉల్లంఘనలుగా పరిగణిస్తున్నామనీ, షార్జా ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఛైర్మన్ బ్రిగేడియర్ అహ్మద్ సయీద్ అల్ నవూర్ మాట్లాడుతూ, ఒక రూంలో కేవలం నలుగరు మాత్రమే వుండాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువమందికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కాగా, 90 శాతం కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కరోనా నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ డ్రైవ్స్ కొనసాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం