రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్‌ షురూ

- October 29, 2020 , by Maagulf
రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్‌ షురూ

కువైట్ సిటీ:పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అలాగే కువైట్‌ మునిసిపాలిటీ సహకారంతో, పలు మార్కెట్‌ సైట్స్‌లో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. లేబర్‌ మరియు రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల్ని గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఖైతాన్‌, జిలీబ్‌ అల్‌ షుయోక్‌, ఫర్వానియా, వఫ్రా, కబాద్‌, జహ్రా సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే అథారిటీస్‌ 100 మందికి పైగా ఉల్లంఘనుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. జిలీబ్‌లో అత్యధికంగా 30 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com