రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
- October 29, 2020
హైదరాబాద్:భారత కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి, వి.మురళీధరన్ రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయ నూతన పునర్నిర్మాణ భవనాన్ని గురువారం నాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రజా సేవలను అందించడానికి లక్ష్యంతో నూతన భవన పునర్ నిర్మాణాన్ని చేపట్టారు. పునర్నిర్మాణ భవనంలో పాస్ పోర్ట్, వలస, మరియు ఐ సి సి ఆర్ సంబంధిత సేవలతో సహా వివిధ సేవలను పొందవచ్చు. ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్,లాక్ డౌన్ సమయంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పబ్లిక్ ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేశారు.

తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







