రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

- October 29, 2020 , by Maagulf
రీజినల్ పాస్ పోర్ట్  కార్యాలయ నూతన  భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్:భారత కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి, వి.మురళీధరన్ రీజినల్ పాస్ పోర్ట్  కార్యాలయ  నూతన పునర్నిర్మాణ భవనాన్ని గురువారం నాడు  ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  నిర్వహించిన ఈ కార్యక్రమంలో  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ,  పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రజా సేవలను అందించడానికి లక్ష్యంతో నూతన భవన పునర్ నిర్మాణాన్ని చేపట్టారు.  పునర్నిర్మాణ భవనంలో  పాస్ పోర్ట్, వలస, మరియు ఐ సి సి ఆర్ సంబంధిత సేవలతో సహా వివిధ సేవలను పొందవచ్చు. ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్,లాక్ డౌన్ సమయంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పబ్లిక్ ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com