'వాట్స్ అండ్ వోల్ట్స్' కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ
- October 30, 2020
హైదరాబాద్:టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి
అయ్యారు.హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్
లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి,
కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో
ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో ఈ
కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.
వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను
నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత
మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి
స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి.
భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ
వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్
దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ
కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన