సిట్రాలో ఎల్‌ఎంఆర్‌ఎ కొత్త బ్రాంచ్‌

- October 30, 2020 , by Maagulf
సిట్రాలో ఎల్‌ఎంఆర్‌ఎ కొత్త బ్రాంచ్‌

బహ్రెయిన్: లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), సిట్రాలో కొత్త ఇంటిగ్రేటెడ్‌ బ్రాంచ్‌ని లీగల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిమిత్తం ప్రారంభించింది. రెండు వారాల పాటు ట్రయల్‌ బేసిస్‌లో దీన్ని నిర్వహిస్తారు. నవంబర్‌ మధ్యలో దీన్ని పబ్లిక్‌ కోసం అందుబాటులో వుంచుతారు. ఎల్‌ఎంఆర్‌ఎ సిఇఓ ఒసామా బిన్‌ అబ్దుల్లా అల్‌ అబ్సి మాట్లాడుతూ, సిట్రా ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఎక్స్‌పాట్రియేట్‌ సర్వీసెస్‌ బ్రాంచ్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సిటిజన్స్‌కీ అలాగే రెసిడెంట్స్‌, బిజినెస్‌ ఓనర్స్‌కి ఎంతగానో ఉపయోగపడనుంది. 1000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. 100కి పైగా పార్కింగ్‌ స్పాట్స్‌నీ అందుబాటులో వుంచారు. ప్రివెంటివ్‌ మరియు లేబర్‌ ఇన్‌స్పెక్షన్‌ డిపార్ట్‌మెంట్స్‌ని ఈ బ్రాంచ్‌ కలిగి వుంటుంది. ఎంప్లాయర్స్‌ని ఇంటర్వ్యూ చేయడం, ఎంప్లాయర్స్‌ ప్రాసెస్‌ క్లెయిములు, ఫిర్యాదులు, ఎంక్వయిరీలు, క్రిమినల్‌ కేసుల టెస్టిమోనీస్‌ ఇక్కడ అందుబాటులో వుంటాయి. వారంలో ఐదు రోజులపాటు అంటే ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు దీన్ని తెరిచి వుంచుతారు. కాగా, ఆరు బ్రాంచ్‌ల నుంచి 650,000 రిఫరెన్స్‌లను ప్రతి యేడాదీ అందుకుంటున్నట్లు అథారిటీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com