దుబాయ్ లో 12 నూతన రోడ్డు ప్రాజెక్ట్ లు
- February 15, 2016
దుబాయ్ రహదారులు మరియు రవాణా శాఖ సంస్థ వివిధ ప్రాజెక్ట్ లను ఎమిరేట్స్‌లో పూర్తి చేసేందుకు 7.6 డిహెచ్ బిల్లియన్లను ఖర్చు చేయనుంద్. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3.7 డిహెచ్ బిల్లియన్లను ఆమోదించారు. ఈ మొత్తంను 55 ప్రాజెక్ట్ లకు ఉపయోగించనున్నారు. వీటిలో 12 నూతన రోడ్డు ప్రాజెక్ట్ లు మరియు 43 ప్రాజెక్ట్ లు అదే విధంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్ రహదారులు మరియు రవాణా శాఖ సంస్థ ఎగ్జీక్యుటీవ్ డైరక్టర్, చైర్మెన్ మాట్టర్ అల్ తఎర్ మాట్లాడుతూ , 2016 లో రహదారులు మరియు రవాణా శాఖ సంస్థ కోసం అనుమతించిన మొత్తం వ్యయంలో 7.6 డిహెచ్ బిల్లియన్లని చెబ్తూ ఇందులో కార్యాచరణ బడ్జెట్ 3.9 డి హెచ్ బిల్లియన్లు కాగా, వాస్తవ నిర్మాణాలకు 3.7 డిహెచ్ బిల్లియన్లను కేటాయించారు. దుబాయ్ రహదారులు మరియు రవాణా శాఖ సంస్థకు ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ గత ఏడాది కన్నా 14 శాతం ఎక్కువని ఆయన తెలిపారు. అలాగే ,ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లలో దుబాయ్ నీటి కాలువ పథకం ఎంతో ముఖ్యమైనదని, ఇది ఈ ఏడాది చివరికల్లా పూర్తి కాబడుతుందని భరోసా ఇచ్చారు. అలాగే మరో ముఖ్యమైన యూనియన్ మ్యుజీయం ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







