భారత్ లో కొత్తగా 46,963 కరోనా కేసులు..
- November 01, 2020న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 46,963 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ఒక్క రోజే మాయదారి వైరస్ బారిన పడి 470 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 6.97 శాతానికి తగ్గాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రికవరీ రేటు 91.54 శాతంగా నమోదు అయ్యింది. మరణాలు రేటు 1.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 81,84,082కు చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 5,70,458 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 74,91,513 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,22,111 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు