భారత్ లో కొత్తగా 46,963 కరోనా కేసులు..
- November 01, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 46,963 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ఒక్క రోజే మాయదారి వైరస్ బారిన పడి 470 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 6.97 శాతానికి తగ్గాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రికవరీ రేటు 91.54 శాతంగా నమోదు అయ్యింది. మరణాలు రేటు 1.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 81,84,082కు చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 5,70,458 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 74,91,513 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,22,111 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







