వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం
- November 01, 2020
సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందుతో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్లలో 10.55 నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'ఫిదా', 'మిస్టర్ మజ్ను', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంతరిక్షం', 'రణరంగం', 'వి' సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌ల్లోనూ కీలకపాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!