మహిళల IPL టైటిల్ స్పాన్సర్ గా జియో...
- November 01, 2020
యూఏఈ:ప్రస్తుతం జరుగుతున్న పురుషుల IPL 2020 చివర్లో అంటే నవంబర్ 4 నుండి 9 వరకు మహిళల IPL నిర్వహించనున్నట్లు ఈ మధ్యే BCCI ప్రకటించింది. ఈ లీగ్ కోసం యూఏఈ కి వెళ్లిన మహిళా ప్లేయర్స్ కి అక్కడ తమ క్వారంటైన్ ను కూడా ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ఏడాది మహిళల టీ 20 ఛాలెంజ్ కు రిలయన్స్ జియో టైటిల్ స్పాన్సర్ గా వ్యవరించనుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ లీగ్ కోసం బీసీసీఐ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ ఈ ఏడాది ఇలా మహిళల IPL టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రత్యేకంగా BCCI ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో BCCI కుదుర్చుకున్న ఈ ఒప్పందం దానిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది అనే చెప్పాలి. అయితే నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్ మరియు వెలాసిటీ అనే మూడు జట్ల మధ్య జరుగుతుంది. ఇందులో వెలాసిటీకి మిథాలీ రాజ్ నాయకత్వం వహించగా, స్మృతి మంధనా, హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉండటంతో వాటిని షార్జాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన