హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం కోవిడ్ పరీక్షా కేంద్రం

- November 02, 2020 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ప్రయాణికుల కోసం కోవిడ్ పరీక్షా కేంద్రం

· ప్రయాణికులంతా సురక్షితంగా ప్రయాణించే దిశగా GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) ఇటీవల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లోపలే కరోనా వైరస్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. దీని వల్ల నగరంలోకి ప్రవేశించే డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లయిట్స్ ప్రయాణీకులు మరియు అంతర్జాతీయంగా బయలుదేరే (డిపార్చర్) ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు. 

· ప్రభుత్వ ఆదేశం ప్రకారం, హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన అంతర్జాతీయ ప్రయాణీకులు వారు బయలుదేరే దేశంలో బయలుదేరే ముందు 96 గంటలలోపు తీసుకున్న నెగిటివ్ RT-PCR నివేదికను కలిగి ఉండాలి.  సంస్థాగత క్వారంటైన్‌ను నివారించడానికి విమానాశ్రయంలో ఉన్న అధికారులకు దీనిని సమర్పించాలి. అయితే, హైదరాబాద్ విమానాశ్రయంలో RT-PCR పరీక్షా సౌకర్యం అందుబాటులో ఉన్నందున, ఇప్పుడు ప్రయాణీకులు హైదరాబాద్‌లో దిగిన తర్వాత కూడా ఆ పరీక్ష చేయించుకోవచ్చు. 

· తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య నిబంధనల ప్రకారం, హైదరాబాద్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ వారు బయలుదేరే దేశంలో తీసుకున్న నెగిటివ్ RT-PCR పరీక్ష సర్టిఫికేట్ (బయలుదేరే సమయానికి 96 గంటలలోపు తీసుకున్నది) లేదా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తీసుకున్న నెగిటివ్ RT-PCR పరీక్ష సర్టిఫికేట్ అవసరం.

· కోవిడ్ నమూనాలను పరీక్షించడానికి సేవలను అందించడానికి GHIAL, హైదరాబాద్ ఆధారిత NABL (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) మరియు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సర్టిఫైడ్ ఏజెన్సీ అయిన ‘మ్యాప్‌మైజీనోమ్’ (mapmygenome)తో ఒప్పందం చేసుకుంది.

· హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మ్యాప్‌మైజీనోమ్’  కోవిడ్ -19 టెస్ట్ ల్యాబ్ 24 గంటలూ పని చేస్తుంది. ప్రయాణీకుల కోసం ఆన్-సైట్ టెస్టింగ్ సదుపాయమే కాకుండా ఇక్కడ విమానాశ్రయ సిబ్బందికి లేదా పరీక్ష చేయించుకోవడానికి ఆసక్తి ఉన్నవారు కూడా ఇక్కడ కోవిడ్ పరీక్షలు చేయించుకోవచ్చు.

· ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో రెండు చోట్ల మ్యాప్‌మైజీనోమ్ నమూనా సేకరణ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి:

o హైదరాబాద్‌ చేరుకుని, ఇక్కడి నుంచి తదుపరి గమ్యస్థానంకు (onward journey) వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ లెవల్‌లో  శాంపిల్ సేకరణ కౌంటర్ అందుబాటులో ఉంది.

o అంతర్జాతీయ నిష్క్రమణ ప్రయాణీకులకు సహాయం చేయడానికి, మరొక నమూనా సేకరణ కౌంటర్ ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (IIDT) ముందు భాగంలో ఏర్పాటు చేసారు. గమ్యస్థానంలో నెగిటివ్ RT-PCR పరీక్ష రిపోర్టును సమర్పించాల్సిన డిపార్చర్ ప్రయాణీకులు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం విమానాశ్రయంలో కోవిడ్ పరీక్ష చేయంచుకోబోయే ప్రయాణీకులు మరింత ముందుగానే విమానాశ్రయానికి రావాల్సి ఉంటుంది. 

· విమానాశ్రయంలో ఈ పరీక్ష కోసం నమోదు చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వారి పేరు, సంప్రదింపు వివరాలు, ఐడి ప్రూఫ్ వంటి వివరాలను అందించాలి. శాంపిల్ ఫలితాలు 3-4 గంటల్లో అందజేస్తారు. ప్రయాణీకులు తమ కనెక్టింగ్ ఫ్లయిట్ బుక్ చేసుకునేటప్పుడు దీనిని గుర్తుంచుకోవాలి. 

· ఈ నెగిటివ్ RT-PCR పరీక్ష రిపోర్టుతో, విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు తదుపరి గమ్యస్థానంకు (onward journey) తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు లేదా సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి, ఏదైనా ప్రత్యేక కారణాల రీత్యా మినహాయింపు పొందితే తప్ప.

· ఈ పరీక్షలో ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే, ప్రయాణీకుల విషయంలో రాష్ట్ర అధికారులు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.

· భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందాలతో మరిన్ని దేశాలకు విమానయానాన్ని విస్తరించడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రయాణీకులందరికీ సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఈ కోవిడ్ పరీక్షా కేంద్రం కీలకం కానుంది.

·  ప్రదీప్ పణికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎల్, “"ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో, అన్‌లాక్ 5.0 అనంతరం భారత విమానయాన రంగంలో విమాన సంఖ్యలను క్రమంగా పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో,  ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించడానికి, విమానాశ్రయాలలో కోవిడ్ -19 పరీక్షా సౌకర్యం చాలా ముఖ్యమైనది. ఇది ప్రయాణీకులలో విశ్వాసాన్ని పెంచుతూ, విమానాశ్రయ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. MOCA ఆదేశాల ప్రకారం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరి పరీక్షలను నిర్ధారించడానికి విమానాశ్రయంలోనే COVID-19 పరీక్షా సదుపాయాన్ని తీసుకువచ్చాము. ICMR మరియ NABL నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి ఈ COVID-19 పరీక్షా ప్రయోగశాలలో తగిన ఏర్పాట్లు చేసాము.’’ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com