ఇండియా సరిహద్దును తాకే రైలు మార్గం..చైనా ప్లాన్

- November 02, 2020 , by Maagulf
ఇండియా సరిహద్దును తాకే రైలు మార్గం..చైనా ప్లాన్

సిచువాన్-టిబెట్ మధ్య రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి చైనా ఆలోచిస్తోంది. 

ఈ రైల్వే మార్గం భారత సరిహద్దుకు దగ్గరగా ఉండబోతుంది. రెండు సొరంగాలు, ఒక వంతెన వంటి వాటితో దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్టు పాలక చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. 

ఈ మార్గం ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో వచ్చి ముగుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది చైనా ప్రకటించిన రెండవ రైల్వే మార్గం. ఈ మార్గంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చైనా భావిస్తోందని చెప్తున్నప్పటికీ, సరిహద్దుల్లో సైనికులు శీఘ్రంగా చేరుకోవడానికి ఇండియా రోడ్లను నిర్మిస్తున్న నేపథ్యంలో, చైనా దానికి బదులుగా రైల్వే మార్గాన్ని సరిహద్దు వద్ద ఏర్పాటు చేస్తునట్టు సమాచారం.  .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com