సంచిలో 5 కేజీల చందనం చెక్కలు..షార్జా వెళ్తుండగా హైదరాబాద్ లో అరెస్ట్
- November 03, 2020
హైదరాబాద్:తన లగేజీలో చందనం చక్కలను తీసుకెళ్తున్న వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి..హైదరాబాద్ నుంచి ఎయిర్ అరేబియా ఫ్లైట్ లో షార్జా వెళ్లాల్సి ఉంది. అయితే..లగేజ్ చెక్ చేసిన అధికారులు నిందితుడి బ్యాగ్ లో చందనం చెక్కలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 5.30 కేజీల చందనం ముక్కలు ఉన్నాయని...వాటి విలువ 13 వేల వరకు ఉంటుందని అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా చందనాన్ని తరలించేందుకు ప్రయత్నించటం నేరమని..నిందితుడ్ని అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







