కువైట్: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

- November 03, 2020 , by Maagulf
కువైట్: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కువైట్ సిటీ:సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పోస్టు చేసిన వ్యక్తిని కువైట్ సైబర్ క్రైమ్ విభాగం అధికారులు అదుపులోకి తసుకున్నారు. నిందితుడు పోస్టు చేసిన పోస్టింగ్స్ ప్రజా నైతిక విలువలకు విరుద్ధంగా..అసభ్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అకౌంట్ హోల్డర్ కు సమన్లు పంపి అతన్ని అతన్ని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగానికి కేసును బదిలీ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అభ్యంతరక ప్రచారం చేపట్టినా..అసభ్య పోస్టింగులు పెట్టిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాలు, సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరించారు. నైతిక విలువలకు కట్టుబడకుండా ఉండే పోస్టింగ్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా..వెబ్ సైట్ లో ప్రచురితమైనా...వాటిని గుర్తించేందుకు తాము నిరంతరం నిఘా కొనసాగిస్తామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com