బాధిత ఇండియన్స్ కోసం వెల్‌ఫేర్ సెంటర్ ఇప్పుడు మరింత అందుబాటులో
- November 03, 2020
దుబాయ్: వీసా గడువు ముగిసిన/ఉద్యోగం కోల్పోయిన/మానసిక ఒత్తిడి కి లోనైన వంటి వివిధ కారణాలచేత బాధపడుతున్న బ్లూ కాలర్ వర్కర్స్‌ని ఆదుకోవడం తమ ప్రధాన అజెండా అని దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ అమన్ పురి చెప్పారు. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రం (పీబీఎస్కె) ను ఇండియన్ కాన్సులేట్ లో ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. 'పీబీఎస్కె' ను జుమైరా లేక్ టవర్స్ నుంచి భారత కాన్సులేట్ ను మార్చగా, ఈ కార్యాలయాన్ని భారత రాయబారి పవన్ కపూర్ ప్రారంభించారు.
జెఎల్‌టిలో వున్న ఫెసిలిటీ, ఇండియన్ వర్కర్స్‌కి అంత కన్వీనియంట్‌గా లేదనీ, రీలొకేట్ చేశాక అందరికీ అది అందుబాటులో వుంటుందని భావిస్తున్నామని కపూర్ పేర్కొన్నారు. 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ హాట్‌లైన్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ఏడుగురు లాయర్లతో కూడిన ప్యానెల్ వర్కర్స్‌కి ఉపయుక్తంగా వుంటుందని అన్నారు. పిబిఎస్‌కె, 8 వేల డిస్ట్రెస్ కాల్స్‌ని ప్రతి నెలా కోవిడ్ కి ముందు రిసీవ్ చేసుకునేది. కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 3 వేల నుంచి 3 వేల 500కి తగ్గింది. సైకలాజికల్ మరియు గ్రీవెన్స్ కౌన్సిలర్స్‌తో ప్రత్యేకమైన ప్యానెల్ కూడా అందుబాటులో వుంచుతున్నారు. కొత్త పిబిఎస్‌కె ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచా సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు అందుబాటులో వుంటుంది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం అలాగే మలయాళం భాషల్లో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష