మానవ అక్రమ రవాణా: వలసదారుడికి జైలు శిక్ష
- November 03, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ న్యాయస్థానం, ఓ వలసదారుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ చీఫ్ ప్రాసిక్యూటర్ మర్వా అల్ నష్వాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు నిందితుడ్ని నేరస్తుడిగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. తన ఎంప్లాయర్ ఇంటి నుంచి తప్పించుకున్న ఓ హౌస్ మెయిడ్‌ని సెక్స్ ట్రేడ్‌లోకి నిందితుడు మళ్ళించాడు. ఆమెని లొంగదీసుకుని, ఆమె ద్వారా ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిందితుడికి 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించారు. బాధితురాలిని స్వదేశానికి తిరిగి పంపేందుకు సంబంధించిన ఖర్చుల్ని కూడా నిందితుడు భరించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు శిక్ష తర్వాత నిందితుడ్ని దేశం నుండి బహిష్కరించటం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష