వందకు పెరిగిన టర్కీ భూకంప మృతుల సంఖ్య

- November 03, 2020 , by Maagulf
వందకు పెరిగిన టర్కీ భూకంప మృతుల సంఖ్య

పశ్చిమ టర్కీలో సంభవించిన భూకంపానికి మృతుల సంఖ్య మంగళవారం నాటికి వందకు పెరిగిందని ఆ దేశ విపత్తు అథారిటీ తెలిపింది. 7.0 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన ప్రకంపనలకు 994 మంది గాయపడ్డారని టర్కీకి ఏజెన్సీ తెలిపింది. ఇజ్మీర్‌ ప్రావిన్స్‌లోని రెస్క్యూ సిబ్బంది జాడలేకుండా పోయిన వ్యక్తుల కోసం ఐదు భవనాల్లో ఇంకా శోధిస్తున్నాయి. శిథిలాల నుంచి మూడేళ్ల, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలను రక్షించారు. అక్టోబర్ 30న టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదయ్యింది. దీంతో టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో సామోస్‌, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సమావేశం సునామీ వచ్చింది. అలాగే టర్కీలో గతేడాది జనవరిలో తూర్పు ప్రావిన్స్‌లైన ఎలాజిగ్‌, మాలత్యాలలో సంభవించిన భూకంపానికి 40 మందికిపైగా మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com