వందకు పెరిగిన టర్కీ భూకంప మృతుల సంఖ్య
- November 03, 2020
పశ్చిమ టర్కీలో సంభవించిన భూకంపానికి మృతుల సంఖ్య మంగళవారం నాటికి వందకు పెరిగిందని ఆ దేశ విపత్తు అథారిటీ తెలిపింది. 7.0 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన ప్రకంపనలకు 994 మంది గాయపడ్డారని టర్కీకి ఏజెన్సీ తెలిపింది. ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని రెస్క్యూ సిబ్బంది జాడలేకుండా పోయిన వ్యక్తుల కోసం ఐదు భవనాల్లో ఇంకా శోధిస్తున్నాయి. శిథిలాల నుంచి మూడేళ్ల, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలను రక్షించారు. అక్టోబర్ 30న టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదయ్యింది. దీంతో టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో సామోస్, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సమావేశం సునామీ వచ్చింది. అలాగే టర్కీలో గతేడాది జనవరిలో తూర్పు ప్రావిన్స్‌లైన ఎలాజిగ్, మాలత్యాలలో సంభవించిన భూకంపానికి 40 మందికిపైగా మరణించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!