ఖమ్మం చేరుకున్నకేసీఆర్
- February 15, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం చేరుకున్న కేసీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత తుమ్మలతో కలిసి పట్టణ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ నూతన బస్టాండ్, ట్యాంక్‌బండ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రమణ గుట్ట వికలాంగుల కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన పీడీఎస్‌యూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు, శ్రీరామదాసు ప్రాజెక్టులకు మంగళవారం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటాని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







