సౌదీ:పేర్ల రిజిస్ట్రేషన్లపై కొత్త రూల్స్...షరియా కోడ్ కు వ్యతిరేక పేర్ల నమోదుపై బ్యాన్
- November 04, 2020
రియాద్:పేర్ల నమోదుకు సంబంధించి అనుసరించాల్సిన కొత్త నిబంధనలను ప్రకటించింది సౌదీ అధికార యంత్రాంగం. ఇక నుంచి ఇస్లామిక్ షరియా కోడ్ ను ఉల్లంఘించేలా ఉండే పేర్లను నమోదుపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అబ్ధుల్ రసూల్(ప్రవక్త దాసుడు), మలక్(ఎంజిల్) పేర్లతో ఇక నుంచి ఎవరికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయబడవని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర వ్యవహారాల విభాగం అధికారులు తెలిపారు. మతపరమైన విశ్వాసాలు, ఫత్వాకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో మహమ్మద్ సలేహ్, మహమ్మద్ ముస్తఫా తరహాలో రెండు పేర్ల సమ్మేళితం అయ్యేలా ఉండే పేర్లపై కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవని వివరించారు. ఇలాంటి రెండు పేర్ల సమ్మేళనంలో సౌదీ చట్ట ప్రకారం తొలి పేరును పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. అయితే...ప్రజల్లో గందరగోళానికి తావులేకుండా పేర్ల రిజిస్ట్రేషన్ పై నిషేధానికి సంబంధించి మాత్రం అధికారులు ఎలాంటి అధికారిక వివరణను ఇవ్వలేదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు