కరోనా వైరస్: ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం వ్యాక్సిన్
- November 04, 2020
బహ్రెయిన్: చైనీస్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి ఇచ్చే ప్రక్రియను బహ్రెయిన్ ప్రారంభించింది. ఎమర్జన్సీ అప్రూవల్ కింద ఈ వ్యాక్సిన్‌ని అందిస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. చైనాకి చెందిన సినోఫాం సంస్థ, ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ మరియు జోర్డాన్లలో కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి 3వ ఫేజ్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం విదితమే. బహ్రెయిన్ హెల్త్ మినిస్టర్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలెహ్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ దేశానికి సంబంధించిన రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా వుందని చెప్పారు. ఫేజ్ వన్, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చిందని అన్నారు. మూడో దశ ప్రయోగాల కోసం 7,770 మందిని ఎంపిక చేశారు. కాగా, అబుదాబీకి చెందిన ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ, మిడిల్ ఈస్ట్‌లో ట్రయల్స్‌ని పర్యవేక్షిస్తోంది. 31,000 మందికి పైగా వ్యక్తులపై నాలుగు దేశాల్లో ఈ ట్రయల్స్‌ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు