కోవిడ్ 19 కేసులు పెరిగితే, పాక్షిక లాక్‌డౌన్
- November 04, 2020
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తోంది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అథారిటీస్ అంచనా వేస్తున్నాయి. దేశం లోపల, దేశం వెలుపల కరోనా పరిస్థితుల్ని ఆరా తీస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతోందని అథారిటీస్ పేర్కొన్నాయి. అవసరమైతే పాక్షిక లాక్‌డౌన్ మరోసారి విధించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19 గణాంకాలు, ఇన్ఫెక్షన్స్, హాస్పిటలైజేషన్స్, మృతుల సంఖ్య, ఐసీయూలో చేరుతున్నవారి సంఖ్య.. ఇలా పలు అంశాల్ని విశ్లేషించడం జరుగుతోందని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. పరిస్థితుల్ని అంచనా వేసి, అవసరమైతే పాక్షికంగా లాక్‌డౌన్‌ని అమలు చేసే అవకాశం వుందని వివరించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోనే వున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు