రెండో పెళ్లి చేసుకున్న నటుడు సామ్రాట్.. హాజరైన తనీష్, దీప్తి సునయన
- November 05, 2020
ఈ ఏడాది టాలీవుడ్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ సింగిల్‌గా లైఫ్ కొనసాగించేస్తున్న హీరోలు, సహనటులు, హీరోయిన్లు, దర్శకులు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. తనీష్, దీప్తి సునయన కూడా ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







