రెండో పెళ్లి చేసుకున్న నటుడు సామ్రాట్‌.. హాజరైన తనీష్, దీప్తి సునయన

- November 05, 2020 , by Maagulf
రెండో పెళ్లి చేసుకున్న నటుడు సామ్రాట్‌.. హాజరైన తనీష్, దీప్తి సునయన

ఈ ఏడాది టాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ సింగిల్‌గా లైఫ్‌ కొనసాగించేస్తున్న హీరోలు, సహనటులు, హీరోయిన్లు, దర్శకులు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. త‌నీష్‌, దీప్తి సున‌య‌న కూడా ఈ వివాహ వేడుకలో సంద‌డి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com