భారత్‌కు చైనా షాక్.. వందే భారత్ మిషన్ కు బ్రేక్
- November 05, 2020
ఇండియా నుంచి వచ్చే వారికి చైనా తాత్కాలికంగా నో ఎంట్రీ అనేసింది. చైనా వీసాలు ఉన్నప్పటికీ.. కొందరు భారతీయులకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ఎంబసీ వెల్లడించింది. దీంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుస్తున్న సర్వీసులకు చైనాలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. నవంబర్ 6న ఢిల్లీ-వూహాన్-ఢిల్లీ సర్వీసుకు సంబంధించి ఇంకా చైనా అధికారుల నుంచి క్లియరెన్స్ రాలేదు. ఇందుకు సంబంధించి మరిన్ని చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సర్వీసును రీషెడ్యూల్ చేసినట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
నవంబర్ 3న చైనాలోకి వచ్చిన 19 మంది భారతీయులకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశం ప్రకటించింది. నవంబర్‌లో మొత్తం మూడు విమానాలు వూహాన్ నుంచి రావాల్సి ఉంది. అయితే అక్కడి చైనా ఎంబసీ ప్రయాణికుల హెల్త్ డిక్లరేషన్ ఫామ్‌లకు ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అయితే దీని వల్ల చైనాకు రావాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ దేశం ప్రకటించింది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైనాకు కేవలం వందే భారత్ మిషన్ సర్వీసులను మాత్రమే నడుపుతోంది. అక్టోబర్‌లో ఢిల్లీ నుంచి షాంఘై, గాంగ్జో, వూహాన్లకు ఢిల్లీ నుంచి విమానాలు నడిపారు. అయితే ఇదే రకంగా ఆగస్టులో ఇండియా నుంచి వచ్చే విమానాలకు హాంకాంగ్ అనుమతులు రద్దు చేసింది. మలేషియా కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









