హీరో రవితేజ చేతుల మీదుగా '' జెమ్'' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
- November 06, 2020
హైదరాబాద్:యువ హీరో విజయ్ రాజా నటిస్తున్న కొత్త సినిమా '' జెమ్'' . రాశీ సింగ్ , నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, అలోక్ జైన్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పత్తికొండ కుమార్ స్వామి నిర్మాత. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న '' జెమ్'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న '' జెమ్'' సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను మాస్ హీరో రవితేజ శుక్రవారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ...మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజ గారికి కృతజ్ఞతలు. రెండేళ్లు శ్రమించి సిద్దం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు మా దర్శకుడు సుబ్రహ్మణ్యం గారు. యాక్షన్ బేస్డ్ గా జెమ్ మూవీ ఉంటుంది. ఆండ్రూ కెమెరా పనితనం, సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అన్నారు.
దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...ఎక్కడా రాజీ పడకుండా జెమ్ మూవీని రూపొందించాం. హై టెక్నికల్ వ్యాల్యూస్ ఉంటాయి. సినిమా పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిభ గల సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పనిచేయడంతో అనుకున్నట్లుగా మూవీని చేయగలిగాం. అన్నారు.
నిర్మాత పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ...జెమ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు సుబ్రహ్మణ్యంకు మొదటి సినిమా ఇది. కష్టపడి సినిమా రూపొందించారు. విజయ్ రాజా ఇన్ వాల్వ్ అయ్యి నటించారు. సినిమాకు పూర్తిగా సహకరించారు. ఔట్ పుట్ సంతృప్తికరంగా వచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఆకర్షణ అవుతాయి. అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ...కుమారస్వామి తమిళ, కన్నడలో సినిమాలు చేశారు. తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన తెలుగులోనే వరుసగా సినిమా చేసేంత పేరు జెమ్ చిత్రంతో రావాలి. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజకు థ్యాంక్స్. సినిమా హిట్ అవ్వాలి, అందరికీ పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
సత్యకృష్ణ, రచ్చ రవి, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, సత్తి పండు, గబ్బర్ సింగ్ రాజశేఖర్, అనంత్, నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - ఆండ్రూ, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం - సునీల్ కశ్యప్, ఫైట్ మాస్టర్ - రియల్ సతీష్, డాన్స్ - భాను, అజయ్, నిర్మాత - పత్తి కొండ కుమారస్వామి, రచన దర్శకత్వం - సుశీల సుబ్రహ్మణ్యం.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!