ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ తో జనవరి నుంచి ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం 'కలియుగం'
- November 06, 2020
హైదరాబాద్:హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో తన స్పెల్-బైండింగ్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం "కలియుగం" అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ "నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ ,అంత గొప్ప కథ ఇది అని, నాలాంటి ఒక నటికీ ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని, అంతేకాక ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను "ఆర్ కె ఇంటెర్నేషనల్" బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మిగతా నటీనటులు టెక్నీకల్ టీమ్ విషయాలు అతి త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







