రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- November 07, 2020
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ హైదరాబాద్ జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే పెద్ద ప్లాంట్ అని అన్నారు. ఎల్బీనగర్ ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 2వేల టన్నుల భవన నిర్మణా వ్యర్థాలు వస్తున్నాయని, చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరో రెండు ప్లాంట్లను కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. మున్సిపల్ వెస్ట్ మేనేజ్మెంట్లో జీహెచ్ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలకు చెక్ పెట్టేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్లతో కన్స్ర్టక్షన్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక, కంకరను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇసుక, కంకర, ఇటుకను పునర్వినియోగ వస్తువుగా మార్చేలా, గంటకు 50 టన్నుల నిర్మాణ వ్యర్థాలను వేరు చేసేలా సీ అండ్ డీ ప్లాంట్‌ను నిర్మాణం చేశారు. టన్ను నిర్మాణ వ్యర్థాల నిర్వహణ రుసుమును రూ. 342గా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







