విక్రమ్‌గా అదరగొట్టిన కమల్ హాసన్

- November 07, 2020 , by Maagulf
విక్రమ్‌గా అదరగొట్టిన కమల్ హాసన్

చెన్నై:తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన పుట్టినరోజు కానుకగా నేడు(నవంబర్ 7న) ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సినిమా అంటే కేవలం తమిళనాటే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి ఎదురుచూపులకు అనుకూలంగా తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు కమల్.

తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వలో కమల్ తన 232వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాకు ‘విక్రమ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను కొన్ని నిమిషాల ముందే చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కమల్ హాసన్ సరికొత్త అవతారంలో కనిపించాడు. సైకో కిల్లర్ తరహాలో ఈ టీజర్‌లో కమల్ కనిపించడంతో ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది. కాగా మరికొందరు ఈ సినిమాలో కమల్ ఓ భారీ మిషన్‌పై ఉన్నాడని, అందుకే హత్యలు చేస్తుండొచ్చని అంటున్నారు.

ఇక తమిళ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ అందించిన బీజీఎం ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. అదిరిపోయే విధంగా ఈ టీజర్ ఉండటంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. బర్త్‌డే గిఫ్ట్‌గా లోకనాయకుడు అందించిన ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్‌లు చేస్తున్నారు. మరి ఈ సినిమా కథ ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com