ఆ వెయ్యి మంది పరిస్థితేంటి?
- May 27, 2015
మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ అయిన వెయ్యి మంది కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్రమ పద్ధతుల్లో వీసా పొందడమే వారు చేసిన నేరం. నిన్న మస్కట్ ఎయిర్ పోర్ట్‌లో వారిని అడ్డుకున్న అధికారులు, ఆ తర్వాత వారిని విడిచి పెట్టేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వారికి ఫైన్ విధించారా? అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తే ఎక్కడున్నారు? అనే అంశాలపై స్పష్టత రావడంలేదు. అక్రమ వలసదారుల పట్ల ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయనీ, ఎవరూ అలాంటివాటిని ప్రోత్సహించరాదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ సలీమ్ అల్ బాదీ చెప్పారు. ఇంకో వైపున 1580 మంది ఇల్లీగల్ ఫారిన్ వర్కర్స్ ఆమ్నెస్టీని ఆశ్రయించారు. తమపై ఎలాంటి పెనాల్టీ ప్రభుత్వం విధించకుండా, తమను స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆమ్నెస్టీని కోరారు బాధితులు.
--- నూనె లెనిన్ కుమార్ (ఒమాన్)
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







