బైడెన్ కు అతిపెద్ద సవాలు ఆ 'ప్యాకేజీ'

- November 08, 2020 , by Maagulf
బైడెన్ కు అతిపెద్ద సవాలు ఆ \'ప్యాకేజీ\'

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలోకూరుకు పోయాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌...ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిలోఆర్థిక సవాళ్ళు మరింత క్లిష్టమైనవి. అంతేకాదు హెచ్1బీ వీసాలపై భారతీయులు సహా ఇతర దేశాల వారికి సానుకూలంగా నిర్ణయం ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బాధ్యత బైడెన్ భుజస్కందాలపై ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కొన్ని నెలలుగా ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు భారీ ఆర్థిక ప్యాకేజీకి డెమోక్రాట్లు ప్రతిపాదించినప్పటికీ ట్రంప్ ఒత్తిడి కారణంగా రిపబ్లికన్లు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

ప్రస్తుతం బైడెన్ అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నందున ప్యాకేజీని ఎంత మేరకు పెంచుతారు..? ఆర్థిక వ్యవస్థకు కరోనా సమయంలో ఎలాంటి ఊతమిస్తారనేది..? చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఆదాయ అసమానతలు 50 ఏండ్ల గరిష్టానికి చేరుకున్నాయి. సంపన్నులపై ఎక్కువ ట్యాక్స్ ఉండాలని ఉదారవాదులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజల్లో కూడా దీనికి మద్దతు ఉందని వివిధ సర్వేల ద్వారా తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోబైడెన్ 2017లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ట్యాక్స్ కట్‌ను వెనక్కి తీసుకుంటామని, కార్పోరేషన్లపై 21 శాతం నుండి 28 శాతానికి పన్నులు పెంచుతామన్నారు.

పన్నులు విధిస్తే వ్యాపారుల నుండి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక పన్నులు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నందున జోబిడెన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారింది. ఒక దేశం ఉత్పత్తులపై మరో దేశం టారిఫ్ పెంచుతూ ట్రేడ్ వార్‌కు తెరలేపాయి. దీనిపై జోబైడెన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com