మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్...
- November 09, 2020
హైదరాబాద్:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు. వారు వీరి అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ''ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను'' అని ట్విట్ చేసారు మెగాస్టార్. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ