ఇల్లీగల్స్పై పాలసీకి సంబంధించి చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్
- November 09, 2020
మనామా:ఇల్గీల్ మైగ్రెంట్ వర్కర్స్‌కి సంబంధించి ప్రభుత్వ పాలసీపై పార్లమెంటరీ డిబేట్ కోసం బహ్రెయినీ లా మేకర్స్ అభ్యర్థన పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైనదని సంబంధిత లా మేకర్స్ చెబుతున్నారు. దేశంలో సుమారుగా 50,000 నుంచి 55,000 మంది ఇల్లీగల్ వర్కర్స్ వున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తాజా అంచనాలు చెబుతున్నాయి. వర్క్ ఫోర్స్‌లో సిటిజన్స్కే అధిక ప్రాధాన్యతనిచ్చేలా డ్రాఫ్ట్ బిల్‌ని బహ్రెయినీ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఎంప్లాయర్స్, బహ్రెయినీ జాబ్ సీకర్స్ రికార్డులను చూసి, క్వాలిఫైడ్ పౌరులకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఈ నిబంధనలని పాటించకపోతే 5,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమాన విధించడం జరుగుతుంది. బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల సంఖ్య 2019లో 477,741 వుంటే, ప్రస్తుతం అది 456,840కి తగ్గింది. బహ్రెయిన్ జనాభలో సగానికిపైగా ప్రవాసీయులు వున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష